Blogger
Dileep
On Blogger since: March 2007
Profile views: 670

My blogs

About me

GenderMale
IndustryEngineering
Locationలండన్, India
Introductionనా గురించి మొత్తం అంతా ఇక్కడే చెప్పేస్తే ఏం బాగుంటుంది చెప్పండి! అయినా సరే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నా గురించి కొంచెం... రాయాలి అన్న తపన వున్నా ఎప్పుడో చిన్నతనంలో రాసిన కవితలు, కథలు, కథనాలు, నాటికలు తప్పితే మళ్ళీ రాసిన పాపాన పోలేదు. "అయినా వెధవది ఎప్పుడూ పనులేనా, మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి", అని బాపు-రమణ గార్లు ముత్యాలముగ్గు చిత్రంలో చెప్పారు కదా (రావుగోపాలరావు గారి ద్వారా)! ఆ కుతూహలం కొద్దీ మళ్ళి రాస్తున్నా. తప్పులు వుంటే క్షమించొద్దు! నిలదీయండి, సరిదిద్దండి, ప్రొత్సహించండి. చివరిగా ఒక్కమాట, మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుపగలరని మనవి. ఇంక చదువుకోండి నా కథలు, కవితలు, పాటలు, పల్లవులు,... వగైరా వగైరా ప్రేమతో మీ.. దిలీప్
Interestsనచ్చేవి సినిమాలు, వంటా-వార్పు, కొత్త కొత్త ప్రదేశాలకి వెళ్ళటం, కొత్తవారిని కలవటం, స్నేహం, క్రికెట్, టెన్నిస్(కేవలం చూడటం వరకే).. ఇవేకాక ఇంకా మార్పులు చేర్పులు కూడా ఉంటాయి లేండి
Favorite moviesఇష్టమైన చలనచిత్రాలు ఇష్టమైన సినిమాలు అంటే అబ్బో.. చాలా వున్నాయి లేండి.. ఎందుకంటే నా ఆరు ప్రాణాల్లో కనీసం నాలుగు సినిమాకే!! కాబట్టి వాటి గురించి ఇంకా తెలుసుకుందురుగానీ ముందు ముందు!!
Favorite musicఇష్టమైన సంగీతం శాస్త్రీయ సంగీతం తెలియదుగానీ, మంచి పాటలు అంటే నాకు ప్రాణం. మంచి అంటే నా వుద్దేశంలో వేనులవిందుగా వుండేవి అని అర్థం.. అపార్థం చేసుకోవద్దు అని మనవి. చెప్పటం మరిచాను ఇళయరాజా స్వరపరిచిన సర్వం నాకు అత్యంత ప్రియం. దీన్ని బట్టీ నాకు ఎలాంటి పాటలు నచ్చుతాయో ఈ పాటికి మీకు అర్థం అయివుంటుంది.
Favorite booksఇష్టమైన పుస్తకాలు పుస్తకాలు అంటే నన్ను గాబరా పెట్టనంత వరకూ, ఉత్సాహంగా వుంచేంత వరకూ ఎలా వున్నా చదువుతాను. చిన్నతనం నుంచీ కథలు, నవలలు, గేయాలు, పద్యాలూ, గద్యాలూ ఇలా చాలా చదివాను. ప్రతి పుస్తకం నుంచి ఏదో ఒక నీతి తెలుసుకోవచ్చు. నేను చదివిన మంచి పుస్తకాలు మీకూ పరిచయం చేస్తాను.
Google apps
Main menu