Raghukul Tilak Mokirala

My blogs

About me

Gender Male
Location Warangal, Andhra pradesh, India
Introduction "అబ్బ చాంతాడంత పేరు" అని అనుకునేవాళ్ళు, పలకటం కష్టం గా ఉన్నవాళ్ళు, అంగ్రేజి అన్నదమ్ములు రఘు అని రాఘూ అని రకరకాలు గా పిలుస్తుంటారు, పలకరిస్తుంటారు. చనువు ఎక్కువున్నవాళ్ళు "నసగాడు" అని కూడా అంటారు. చినప్పుడు సంగీతం నేర్చుకోవాలని ఉండేది ఒక చిరు కోరిక. అది కాస్తా తీరక, స్వతహాగా నేర్చుకునేంత scene లేక రకరకాలు గా పాటలను, సంగీతాన్ని నాదైన శైలి లో చిత్రహింసలు చేస్తుంటాను.అంత పరిచయం లేకున్నా, కవిత్వం అన్న తెలుగు సాహిత్యమన్న కూసంత మక్కువ ఎక్కువే. ఆ ఇష్టం తో సినీ గేయాలు వినటం ఆరంభించాను, సాహిత్య కోణం నుంచి. తొలిగా సాయి కృపా ఝరిలో తడిసి, ఒక పాట రాసాను. అమ్మ నాన్నలకు చూపించగానే OK ముద్ర వేసారు. ఇంక అప్పటినుండి తోచింది రాస్తున్నను. కొన్ని బాగున్నాయని, కొన్ని పరవాలేదని, కొన్ని చెత్త సాహిత్యమని విమర్శలు పొందాయి. సరే, ఏదైతే ఏంటి అని ధైర్యం చేసి మీ అందరి ముందుకి ఈ వేషం వేసుకు వచ్చాను. మీకు కాలక్షేపాన్ని కలిగిస్తే ఆశీర్వదించండి. బుర్ర తింటే క్షమించండి.