Raghava Charya SPB
My blogs
| Introduction | మనం ఎవరంటే పెద్దవారి పేరు చెప్పుకోవడం రివాజు. అలా నేనెవరో .. భగవంతుడంటే ఇష్టం ఉన్న వాళ్లకి చెప్పాలంటే, శ్రీవేంకటేశ్వర సుప్రభాతం రచించిన శ్రీమాన్ ప్రతివాది భయంకరం అణ్ణన్ గారికి 15వ తరం మనవడిని. సాహిత్యమంటే ఇష్టమున్నవారికి చెప్పాలంటే .. పిఠాపురం సంస్థానంలో అర్థ సింహాసనాన్ని పొంది సహస్రావధానానికి శ్రీకారం చుట్టిన శ్రీమాన్ ప్రతివాది భయంకరం రాఘవాచార్యులు గారికి 5వ తరం మనవడిని. దేశభక్తి ఉన్న వారికి చెప్పాలంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొని అండమాన్‌లో ప్రవాస శిక్షను అనుభవించిన ఏకైక ఆంధ్రుడు ప్రతివాది భయంకరాచార్యులు గారికి మూడవ కుమారుడిని. పెద్దలు బోధ చేసిన ఈ పరిచయం అందరి ప్రశంసల కోసం కాదు. భగవంతుడు, కళలు, సమాజం అంటే పూర్ణమైన అంకితభావం ఉన్న మహానుభావుల వరుసకు నేను వంకర కాకుండా, కనీసం అట్టడుగున నిలబడి ఉండేట్టు మీరంతా ఓ కంట కనిపెట్టాలనే కైజోత. నేనుగా ఇప్పుడు .. శ్రీమాన్ అణ్ణన్ స్వామి పూజించుకున్న ద్వాదశ సాలగ్రామాలు, అర్చామూర్తులను సేవించుకుంటూ, సాధనలో కాల వినియోగం చేస్తూ .. భగవత్ప్రసాదంగా అందిన అనుభవాన్ని మీతో పంచుకోవాలని, సునామీ అంత, ఉత్సుకత ఉన్నవాడిని. గతంలో కొందరికి జర్నలిస్టుని. |
|---|

