డా. సంగుభొట్ల సాయిప్రసాద్
My blogs
| Introduction | ఆంధ్రా యూనివర్సిటిలో సంస్కృతం ఎం.ఏ., రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ., "రామాయణ కల్పవృక్షంలో సామాజికత" అనే అంశంలో ఎం.ఫిల్. , "తెలుగులో రామాయాణాలు వాటి దేశీయత" పై పీ.ఎచ్‌డీ. "ఆధునాకాంధ్ర కవిత్వంలో విభిన్న వాదాలు", "శ్రీ హర్ష నైషధంలో శృంగార భావనలు", "రామాయణ కల్పవృక్షంలో సామాజికత" అనే పరిశోధనా గ్రంధాలు, "పొగమంచు", "అంచులేని దృశ్యం", "గాయపడ్డ గుండెకేక" అనే కవితా సంపుటాలు, "సుధార్ణవం" అనే వ్యాస సంపుటి, "స్తబ్ద చలనం" అనే కావ్యం ఇప్పటికి అచ్చైన రచనలు. కవిగా విద్యా సంవర్ధిని పరిషత్, బెంగుళూరు వారిచే "ఆంధ్ర భాషా భూషణ" బిరుదుతో బాటు ఇంకా ఎన్నో పురస్కారాలు. అనేక తెలుగు పత్రికలలో కవితల ప్రచురణ. వృత్తి రీత్యా గుంటూరు శ్రీ చైతన్య కళాశాలలో సంస్కృతం లెక్చెరర్. |
|---|
