Umaprasad Bhagavatar

My blogs

About me

Gender Male
Industry Accounting
Occupation Retd.head cashier/vpt
Location Vishakapatnam, Andhrapradesh, India
Introduction సాధారణ జీవితాన్ని గడుపుతున్న నన్ను 'ఆంజనేయస్వామి ' 1978 లో ఆధ్యాత్మిక మార్గములోనికి మరల్చి సాధకునిగా తీర్చి దిద్ది నడిపిస్తున్నారు. సుందర దాసు ఎం ఎస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా గానమును మొదటి కానుకగా ఇచ్చారు. వారి సుందరకాండ పుస్తకమును వారి చేతే ఆశీస్సులతో 11-09-78 తేదీన ఇప్పించారు. మొదటి సుందరకాండ కార్యక్రమమును భగవత్స్వరూపులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యుల స్వామి వారి మంగళాశాసనములతో 31-03-95 తేదీన ప్రారంభింపచేశారు. 1,3,5,7,9,11 రోజులపాటు కార్యక్రమములు అభినయ పూర్వకముగా, వ్యాఖ్యాన సహితముగా [సన్నివేశము కనిపించు రీతిలో] జరుగుతున్నాయి. ఇప్పటికి అనగా 04-11-09 తేదీనాటికి సుందరకాండ కార్యక్రమములు 628 జరిగాయి. 19 కోట్లు " శ్రీ రామ నామములు " భక్తుల చేత వ్రాయించి సేకరింపబడ్డాయి. అందులో 13 కోట్లు స్థూపములోను,ప్రతిష్థల సందర్భముగాను, స్వామి విగ్రహము హృదయమునందు సద్వినియోగము గావించ బడినాయి. సకల దేవతల సంకీర్తనలు 7000 లకు పైగా జరిగినవి. తులసీదాసు హనుమాన్ చాలీసా పునశ్చరణలు 2 లక్షలకు పైగా జరిగనవి.
Interests హనుమాన్ చాలీసా పారాయణ ప్రచారము, శ్రీ రామనామములు వ్రాయించి సేకరించడము వాటిని స్థూపములయందు శ్రీ రామ విగ్రహ ప్రతిష్థల యందు నిక్షిప్తము గావించడము, భగవన్నామములను [ అందరి దేవతలపైనా 300 లకు పైగా ఉన్నవి] గానము చేస్తూ భక్తులందరిచేతా గానము చేయించడము, సుందర కాండ కధాగానములు, పంచాక్షరీ మంత్ర జప సహిత జ్యోతిర్లింగ అర్చనలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమములు చివరి క్షణమువరకు చేసే అదృష్టమును గురు దేవులు శ్రీ అంజనేయస్వామి కల్పించాలని యీ సాధకుని కోరిక .