సాయిప్రియ సత్సంగం

My blogs

Blogs I follow

About me

Introduction ఈ దేవాలయం కేవలం బాబా భక్తులకు, దైవ భక్తులకు మాత్రమే.. నాస్తికులకు, నమ్మనివారికి, అహంకారులకి, అవహేళన చేశేవారికి, మేము మాత్రమే భక్తులమనేవారికి, ఎదుటివారు మాముందు గడ్డిపరకలనుకునే మేథా(తా) వులు దేవాలయ ప్రవేశానికి అర్హులు కారని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. మా నమ్మకమే మా బలమని అనుకుంటూ ఈ దేవాలయాన్ని నిర్వహించడానికి పునాది వేసుకున్నాము. ఆ నమ్మకాన్ని దృఢం చేయండి తప్పితే అపనమ్మకమనే విషబీజం నాటవద్దని వినమ్రమైన వినతి. గమనిక: బంధువులు కూడా ఈ దేవలయాన్ని సందర్శించవద్దని మనవి. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న నానుడిని అనుసరించి ఈ పెరటి చెట్టుపై దృష్టి సారించవద్దని.. సోదరుని ఒకానొక వాక్యాన్ని మనసులో ఉంచుకుని దాన్ని ఆచరించాలని ఆకాంక్షతో వేడుకుంటున్నాం.. ఆ వాక్యం" రిలేషన్ మధ్యలో దేవుడిని తీసుకురాకండి".